రామ మందిరం నిర్మాణానికి అనూహ్యంగా ముస్లింలు మద్దతు..

రామ మందిర నిర్మాణం విషయంలో ప్రజలకు తనపై ఉన్న నమ్మకాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. రామ మందిరం నిర్మాణం చేయాలంటూ ఇటీవల లక్నోలో ముస్లింలు బ్యానర్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ నిర్మాణం చేయాలంటూ బ్యానర్లు ఏర్పడ్డాయని అన్నారు. అయితే రామమందిరం నిర్మాణంపై నెలకొన్న వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలన్న సుప్రీంకోర్టు సూచనకు కట్టుబడి ఉన్నానన్నారు. ఈ అంశంలో ఇరువర్గాల మధ్య చర్చలు జరగకుండా సమస్య పరిష్కారం కాదని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే.. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టాక.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అనూహ్యంగా ముస్లింలు మద్దతు తెలుపుతున్నారు.
అలాగే భారత దేశానికి తాజ్ మహల్ గుర్తింపు చిహ్నం కాదని, భారత్ లో అత్యధిక పర్యాటకులు సందర్శించే స్థలం ఆగ్రా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కానీ.. ప్రేమకు చిహ్నం, ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ ఆధారంగా దేశానికి గుర్తింపునిచ్చే ప్రయత్నం చేయడం సరైంది కాదని యోగి వ్యాఖ్యానించారు. రామమందిర నిర్మాణం కోసం రాళ్లు సమకూర్చేందుకు తన అనుమతి అవసరం లేదని అన్నారు.
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE