భూమికి అంతం తప్పదు.. రానున్న రోజులలో చంద్రునిపై నివాసాలు

రానున్న రోజులలో భూమి అంతం కాక తప్పదని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరిక్షంలో లెక్కలేనన్ని గ్రహశకలాలు తిరుగుతున్నాయని, భూమిని గ్రహశకలం ఢీ కొట్టడం ఖాయమని, అందులో చాలా వరకు ప్రమాదరహితమైనవే ఉన్నాయి.. అయినా సడన్ గా ఏదైనా గ్రహశకలం భూమిని ఢీ కొడితే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. అనుకోకుండా జరిగే ఇలాంటి ప్రమాదాలతో భూమిపై నగరాలకు నగరాలే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇందుకు ఉదాహరణగా గతంలో జరిగిన ఓ సంఘటనను ఖగోళ పరిశోధకులు చెప్పారు. సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతంలో 1908 జూన్ 30న ఓ గ్రహశకలం భూమిని ఢీ కొత్తగా 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కనుమరుగైపోయిందని. ఈ విధ్వంసం కారణంగానే జూన్ 30ని 'ప్రపంచ ఆస్ట్రాయిడ్ డే' గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, ఇంకోవైపు కాలంచెల్లిన ఉపగ్రహాలను తీసేసేందుకు అయస్కాంత శక్తిని వినియోగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సదరు ఉపగ్రహాన్ని ఆకర్షించి దారి మళ్లించడమో లేక ఎడారి ప్రాంతాల్లో పడేయడమో చేయాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అంతరిక్షంలో ప్రమాదకర రీతిలో పెరిగిపోతున్న వ్యర్థాల నిర్వహణలో భాగంగా ఈ విధానాన్ని కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ టొలస్సీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మానవ జాతి మనుగడ కొనసాగించాలంటే భవిష్యత్తులో గ్రహాంతరాలకు వలస వెళ్లాల్సిందేనని, వచ్చే 2020 నాటికి చంద్రుడిపైకి, 2025 నాటికి అంగారకుడిపైకి వ్యోమగాములను పంపించాలని దానికోసం విశ్వాంతరాలలో ఇప్పటినుంచే అన్వేషించాలని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇంకోసారి స్పష్టం చేసారు. గ్రహశకలాలు ఢీ కొట్టడం వల్లనో లేక సూర్యుడిలో కలిసి పోవడం ద్వారానో భూగ్రహం రూపు కోల్పోతుందని, ఇంకో 10 లక్షల సంవత్సరాల తర్వాత భూగ్రహంపై జీవ మనుగడ సాధ్యం కాదని, మనల్ని మనం కాపాడుకోవాలంటే కొత్త గ్రహాలను కనుగొని, వలస వెళ్లక తప్పదని, ఈ మేరకు పరిశోధనలలో వేగం పెంచి రానున్న 30 ఏళ్లలో చంద్రుడిపై నివాసాలను ఏర్పాటు చేయాలని.. ఖగోళ పరిశోధకులు ఇదే లక్ష్యంగా పనిచేయాలని.. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఏకమై ముందుకెళ్లాలని హాకింగ్ సూచించారు.
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE