జియో ప్రైమ్ తీసుకోకపోతే కలిగే నష్టాలు!



రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ నమోదు కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఆన్‌లైన్‌లో, రిలయన్స్ జియో స్టోర్స్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. 99 రూపాయలు చెల్లించి ప్రైమ్ మెంబర్‌షిప్ పొందితే ప్రస్తుత టారిఫ్‌ను మరో సంవత్సరం పాటు పొందొచ్చు. 303 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు 30జీబీ హైస్పీడ్ 4జీ డేటా లభిస్తుంది. అంతేకాదు, జియో ప్రైమ్ యూజర్లు కొన్ని ప్రత్యేక ప్లాన్స్‌ను కూడా పొందుతారు. జియో ప్రైమ్ యూజర్లకు, నాన్ జియో ప్రైమ్ యూజర్లకు వర్తించే డేటా ప్యాక్స్‌లో తేడాలివే.

19 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 200 ఎంబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 100 ఎంబీ డేటా, 1రోజు వ్యాలిడిటీ

49 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 300 ఎంబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 300 ఎంబీ డేటా, 3రోజుల వ్యాలిడిటీ

96 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 1జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 600 ఎంబీ డేటా, 7రోజుల వ్యాలిడిటీ

149 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 2జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 1జీబీ డేటా, 28రోజుల వ్యాలిడిటీ

303 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 30జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 2.5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ

499 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 58జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ

999 రూపాయల ప్లాన్: ప్రైమ్ మెంబర్స్‌కు 60జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 12.5జీబీ డేటా, 60రోజుల వ్యాలిడిటీ

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి

loading...
RECENT POSTS - SPICY

RECENT POSTS - MOVIES

RECENT POSTS - LIFE STYLE