ఇకపై హస్తప్రయోగం చేస్తే రూ. 6,600 జరిమానా? మగాళ్ళు జాగ్రత్త..


అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు చర్యలు మొదలయ్యాయి. రాష్ట్ర శాసనసభ సభ్యుడు జెస్సికా ఫర్రార్ ఓ వినూత్నమైన బిల్లుని తెరపైకి తెచ్చి మగవారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళతో లైంగికచర్యలో పాల్గొనకుండా స్కలించడం, హస్తప్రయోగం వంటి చర్యలకు పాల్పడిన మగవారికి 6,600 రూపాయలు(100 డాలర్లు) జరిమానా విధించాలనే ఓ బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ‘పౌరులు తెలుసుకునే చట్టం’ అనే పేరుతో ఈ బిల్లుని ఆయన శుక్రవారం ప్రవేశపెట్టారు.

హస్తప్రయోగం, స్కలించడం వల్ల ఓ జీవి జన్మించకుండా, ఓ పవిత్రమైన ప్రాణాన్ని ఇవ్వకుండా మగవారు కారణమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. శుక్రకణాల విలువ, వయోగ్ర మందుల వాడకానికి...సంబంధించిన అంశాలను ఈ బిల్లులో పొందుపరిచానని ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు. పౌరులు తెలుసుకోవాల్సిన వివరాల గురించి ఓ పుస్తకాన్ని ప్రభుత్వం ముద్రించాలని, ప్రతీ పౌరుడు ఈ పుస్తకాన్ని చదివేలా చేయాలని కోరారు. అంతేకాకుండా మగవారికి వైద్య పరిక్షలు నిర్వహించి హస్తప్రయోగం చేసిన మగవారికి 100 అమెరికా డాలర్ల జరిమానా విధించాలని బిల్లులో కోరానని, అబార్షన్ కేంద్రాల సంఖ్యను తగ్గించాలని సూచించానని ఆయన తెలిపారు.

వినూత్నమైన ఈ బిల్లు చట్టసభల ముందుకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. సభ్యుల చర్చ అనంతరం ఈ బిల్లుపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. బిల్లు అమలులోకి రావడం, రావకపోవడం తర్వాత విషయాలైతే.. జెస్సికా ఫర్రార్ ఆలోచనా విధానం చర్చలు కొనసాగుతున్నాయి. ఆయన ఆలోచన బాగానే ఉన్నప్పటీ ఇది సాధ్యమయ్యే పనేనా? అని పలువురు విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి

loading...
RECENT POSTS - SPICY

RECENT POSTS - MOVIES

RECENT POSTS - LIFE STYLE