బాహుబలి ట్రైలర్.. గెండెలు అదిరిపోయేయాయ్ అంతే..!
తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఒక్కదెబ్బతో యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన భారీ విజువల్ వండర్ బాహుబలి. వందల మంది టెక్నీషియన్స్, వేల మంది ఆర్టిస్టులతో కొన్ని దాదాపు 5 సంవత్సరాలుగా నిర్విరామంగా కష్టపడిన బాహుబలి టీమ్ ఎట్టకేలకు తమ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసుకుంది. బాహుబలి పార్ట్-1 ద్వారా 600 కోట్లరూపాయలు వసూళ్ళు చేసిన జక్కన్న టీమ్ ఈసారి బాహుబలి పార్ట్ -2తో 1000కోట్ల రూపాయలను రాబట్టాలనుకుంటున్నారు. ఇది కేవలం ఆశ మాత్రం కాదు. సినిమాపై ఉన్న అంచనాలు, అంచనాలకు తగిన రిజల్ట్ ఇచ్చేందుకు రాజమౌళి చేసిన కృష్టి కచ్చితంగా 1000కోట్లు వసూళ్ళు రాబడతాయట.
ఇవి కల్పిత మాటలు కాదు. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ వీడియో చెబుతున్న నిజాలు. సినిమాతో సంబందం లేకుండా కేవలం బాహుబలి-2 ట్రైలర్ మాత్రమే 100రోజులకు పైగా ట్రెండ్ అవుతుందట. ఈ మాట మరెవరో చెప్పలేదు.‘బాహుబలి’ బృందానికి చాలా దగ్గరివాడు , కీరవాణి తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ రమణ. బాహుబలికి తనవంతు సాయంగా సాంకేతిక సహకారం అందిస్తున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇటీవల బాహుబలి ట్రైలర్‌ను చూశాడట. ‘‘బాహుబలి-2 ట్రైలర్ చూశా. గుండెలు అదిరిపోయినయ్. సినిమా కాదు.. కేవలం ఈ ట్రైలరే వంద రోజులు ఆడుతుంది. నా మాటలు గుర్తు పెట్టుకోండి. ట్రైలర్ త్వరలోనే రిలీజవుతుంది’’ అంటూ ఆసక్తికర ట్వీట్ చేశాడు కళ్యాణ రమణ. అసలే బాహుబలి2పై ఊహించని అంచనాలు పెరిగిపోతుంటే, ఇప్పుడు కళ్యాణ రమణ చెప్పిన మాటలతో ఆ అంచనాలు తారస్థాయిని దాటేస్తున్నాయనే చెప్పాలి. ఇక ఈ ట్రైలర్‌ని ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ప్రేక్షకులు తెగ వెయిట్ చేసేస్తున్నారు.
Read: దుమారం లేపుతున్న శ్రీ విద్య MMS లీక్
Read: మొదటి రాత్రి పెద్దలు అమ్మాయికి ఏం చెప్పి గదిలోకి పంపుతారో తెలుసా
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE