ఇలా చేస్తే సిగరెట్స్ ఎంత తాగిన ప్రాణానికి ముప్పు ఉండదంట...!!
ఎంతగా ప్రయత్నించినా సిగరెట్ తాగే అలవాటు మానుకోలేకపోతున్నారా? సిగరెట్ తాగడం ద్వారా తలెత్తే దుష్ఫలితాల గురించి బెంగగా ఉందా? అయితే సిగరెట్ తాగే గంట ముందు రెడ్ వైన్ తాగితే ప్రతికూల ప్రభావాలు చాలా వరకు తగ్గుతాయట.
స్మోకింగ్ వల్ల ధమనుల గోడలు, ప్లేట్‌లెట్స్, తెల్ల రక్త కణాలు దెబ్బతినడాన్ని వైన్ తగ్గిస్తుందట. అంతేకాదు.. మంటను, త్వరగా వయసు మీద పడటం వంటి దుష్ఫలితాలను కూడా అరికడుతుందట. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ సార్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
ఇందుకోసం సిగరెట్ తాగే అలవాటు లేని ఆరోగ్యవంతులైన 20 మంది వ్యక్తులను వారు ఎంచుకున్నారు. వారికి తలో మూడు సిగరెట్లు ఇచ్చి కాల్చమన్నారు. వీరిలో సగం మందికి పొగ తాగే గంట ముందు ఓ గ్లాస్ రెడ్ వైన్ ఇచ్చారు.
స్మోకింగ్ కారణంగా ధమనుల గోడల నుంచి సూక్ష్మ కణాలు విడుదల కావడాన్ని వైన్ నిరోధించినట్లు వారు గుర్తించారు. అంతే కాదు సిగరెట్ తాగిన తర్వాత టెలోమెరేస్ అనే ఎంజైమ్ కారణంగా వయసును త్వరగా పెరగడాన్ని కూడా రెడ్ వైన్ అరికడుతుందని వారి పరిశోధనలో వెల్లడైంది. రక్తంలో ఆల్కహాల్ స్థాయులు 0.75 శాతం పెరిగేంత మోతాదులో పరిశోధనలో పాల్గొన్నవారికి వైన్ ఇచ్చారు.
అలా అని మీరు కూడా ప్రయత్నించకండి. ఎందుకంటే వారు ప్రయోగం కోసం చేసారు. మనకి మన కుటుంభం ఎంతో అవసరం, వారి గురించి ఆలోచిద్దాం.
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE