వేడెక్కిస్తున్న కాజల్ ముద్దుసీన్స్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా రేస్ లో ఉన్న బ్యూటీ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ నటించిన హిందీ చిత్రం ‘దో లఫ్జోంకీ కహాని’ బాలీవుడ్ బాక్సాపీస్ ని షేక్ చేస్తుంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ నటనకు విమర్శకుల వద్ద నుండి సైతం మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. రణ్‌దీప్, కాజల్ జంటగా నటించిన ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాపై బాలీవుడ్ ప్రేక్షకులు సైతం మంచి మార్కులే వేశారు.
కాజల్ ఓ మెచ్యూర్డ్ రోల్‌లో,అంధురాలిగా కనిపిస్తూ, రణదీప్ తో కలిసి మంచి కెమిస్ట్రీ చేసిందని అంటున్నారు. అలాగే కాజల్ అగర్వాల్ నటన అద్భుతంగా ఉండటంతో, తనతో నటించేందుకు ప్రముఖ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకూ సౌత్ ఇండియా హీరోయిన్స్ లిప్ లాక్స్ సీన్స్ కి కొంత దూరంగా ఉంటారు. కానీ కాజల్ మాత్రం ఈ మూవీలో రణ్ దీప్ తో చక్కటి లిప్ లాక్స్ సీన్స్ లో నటించి, బాలీవుడ్ హీరోయిన్స్ కి షాక్ ఇచ్చింది.
కాజల్ లిప్ లాక్స్ ని చూపిన ఓ క్రేజీ హీరోయిన్.. అప్పుడే కాజల్ పై కామెంట్ కూడ చేసింది. కాజల్ ఇలాగే చేస్తే..తనకు ఆఫర్స్ రావేమో అని చెప్పుకొచ్చింది. ఇక కరణ్ జోహార్ అయితే కాజల్ ని ప్రత్యేకంగా పొడిగాడు. అంతటితో ఆగకుండా తన ప్రొడక్షన్ లో రాబోతున్న మూవీలలో కాజల్ కి తప్పకుండా హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పటం ఇక్కడ విశేషం.
ఇదిలా ఉంటే, కాజల్ సైతం ‘దో లఫ్జోంకీ కహాని’ మూవీ కారణంగా తనకు వస్తున్న క్రేజ్ ని ఎంజాయ్ చేస్తుంది. నిజానికి ‘దో లఫ్జోంకీ కహాని’ మూవీ బాక్సాపీస్ వద్ద భారీ సక్సెస్ ని సాధించే మూవీ ఎంత మాత్రం కాకపోయినా, ఈ మూవీలోని తన రోల్ కి వచ్చిన రెస్పాన్స్ ని మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తుందని అంటున్నారు. అయితే, కాజల్ మాత్రం తెలుగులో ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ని అస్సలు చేయను అని అంటుండటమే ఇక్కడ విశేషం.
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE