ఇండియన్ ఆఫ్ ది ఇయర్ గా రాజమౌళి !
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రాజమౌళి సొంతం అయింది. అందరికి షాక్ ఇస్తూ ఒక దక్షిణ భారత దేశ ఫిలిం సెలెబ్రెటీకి ఈ అవార్డు రావడం టాలీవుడ్ పరిశ్రమకు గర్వంగా మారింది. ప్రముఖ న్యూస్ ఛానల్ సి.ఎన్.ఎన్. ఈ అవార్డును నిన్న దేశ రాజధాని న్యూ ఢిల్లీలో అనేక మంది ప్రముఖుల మధ్య జరిగిన ఒక ఫంక్షన్ లో ఈ అవార్డును రాజమౌళికి అందించింది. ఈ అవార్డు ను ఫైనాన్సుమినిస్టర్ అరుణ్ జైట్లీ చేతుల మీదుగా మన జక్కన్న అందుకున్నాడు.
ఈ అవార్డు కోసం పోటీపడిన రణవీర్ సింగ్, దీపిక పదుకొనె, ప్రియాంక చోప్రా, సంజయ్ లీలా భన్సాలీ కంటే రాజమౌళికి ఆన్ లైన్ వోటింగ్ లో ఎక్కువ ఓట్లు రావడం రాజమౌళి గొప్పతనాన్ని సూచిస్తోంది. ఈ అవార్డును అందుకుంటూ రాజమౌళి ఈ అవార్డు తనకు మాత్రమే వచ్చిన అవార్డు కాదని ఈ అవార్డు మొత్తం ‘బాహుబలి’ టీమ్ కు చెందుతుంది అంటూ ఉద్వేగంగా అన్న మాటలు రాజమౌళి నోటి వెంట రాగానే ఆ సమావేశ ప్రాంగణం చప్పట్లతో హోరెత్తి పోయింది.
ఇండియన్ సినిమా ఖ్యాతిని తన ‘బాహుబలి’ తో ప్రపంచ వ్యాప్త గా గుర్తింపు తీసుకువచ్చినందులకు ఈ అవార్డును రాజమౌళికి ఇస్తున్నట్లు సి.ఎన్.ఎన్. ఛానల్ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ఇచ్చిన స్పూర్తితో రాజమౌళి మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈ నెల 13 నుండి ప్రారంభించబోతున్న తన ‘బాహుబాలి 2’ క్లైమాక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు అని భావించడంలో సందేహం లేదు.
టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ దర్శకుడు సాధించనన్ని విజయాలు సాధించడమే కాకుండా మరి ఏ దర్శకుడు ఇప్పటి వరకు అందుకోనన్ని గౌరవాలు అందుకుంటూ రాజమౌళి టాలీవుడ్ లో తన ముద్రను శాశ్వతం చేసుకుంటున్నాడు..
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE