నిహారికకు నాగబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడా!
తాజాగా ఈ అమ్మడు ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది..ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ మద్య నిహారికపై కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో డబ్బింగ్ విషయంలో ఇబ్బంది పెడుతున్నట్లు చిత్ర యూనిట్ ని ఇబ్బంది పెడుతున్నట్లుగా మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది కనుకనే అంత డిమాండ్ చేస్తుందని వారు ఆరోపించినట్లు వార్తలు రావడంతో నిహారిక కు నాగబాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కూతురు సినిమాల్లోకి వస్తానంటే ముందుగా కాస్త బెట్టు చేసినా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగబాబు కు నిహారిక పై విపరీతమైన కోపం వచ్చందట.
మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఆఫర్లు వస్తుండటంతో కథ వినకుండానే కొంతమంది దగ్గర అడ్వాన్స్ లు పుచ్చుకుందట నిహారిక దాంతో నాగబాబు కు ఎక్కడా లేని కోపం వచ్చిందట. అంతే కాదు ముందుగా కథ వినకుండా కమిట్ మెంట్ అయితే ఈ మద్య టాప్ హీరోల సినిమాలు సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం లాంటి బాక్సాఫీస్ వద్ద బొల్తా పడ్డాయని అందుకే కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిహారకు వార్నింగ్ ఇచ్చాడట. అడ్వాన్స్ లు తీసుకోవలసిన అవసరం లేదని మంచి కథ తో వస్తే తప్పకుండా చేయొచ్చని అంతేకాని కథ లు వినకుండా డబ్బులు తీసుకుంటూ ఓకే చెప్పొద్దని హితువు పలికాడట నాగబాబు.
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE