లీక్ అయిన జనతా గ్యారేజ్ డైలాగులు?
జూనియర్ అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న ‘జనతా గ్యారేజ్’ డైలాగులు లీక్ కావడంతో అవి ఈరోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయాయి. ఈ డైలాగులను చూసి జూనియర్ అభిమానులు ఫిదా అయిపోయి వాటిని ఒకరికి మరొకరు షేర్ చేసుకుంటూ వెబ్ మీడియాలో సందడి చేస్తున్నారు.
వాస్తవానికి ఈ డైలాగులు నిజంగా ఎన్టీఆర్ ‘జనత గ్యారాజ్’ కి సంబంధించినవో కావో తెలియకపోయినా ఆ డైలాగ్ లలో మంచి పంచ్ లు ఉండటంతో జూనియర్ అభిమానులు ఈ డైలాగ్స్ చదువుకుంటూ మంచి ఖుషిగా ఉన్నారు. ప్రస్తుతం వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్న డైలాగులు ఈవిధంగా ఉన్నాయి.
‘ఆకలేస్తే అన్నం పెట్టె అమ్మ, భయం వేస్తె తోడుగా నిలిచే నాన్న లేకపోతె ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనిషికి అంతకు మించి నరకం ఉండదు. లక్ష్మణ రేఖ దాటిన తర్వాత రక్షణ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోవడానికి నేను లక్ష్మణుడిని కాదురా లక్ష సముద్రాలైన దాటి ఆపదలో ఉన్న వారిని కాపాడటానికి దూకే అంజినేయుడుని, ఈ గ్యారేజ్ జోలికి వస్తే ఒక్కొక్కడి బాడీలు కృష్ణా బ్యారేజ్ లో తేలుతాయి, అన్న గ్యారేజ్ లో రిపెర్లె కాదు అమ్మాయిల హార్ట్ ల రికవరీలు కూడా చేసేస్తాడు’ అనే డైలాగులు ప్రస్తుతం వెబ్ మీడియాలో ‘జనతా గ్యారేజ్’ లో జూనియర్ వేసిన పంచ్ డైలాగ్స్ గా హడావిడి చేస్తున్నాయి.
అయితే ఈ డైలాగులలో రచయిత కొరటాల శివ స్పార్క్ అక్కడక్కడా కనిపిస్తూ ఉండటంతో ఈడైలాగులు నిజంగానే ‘జనతా గ్యారేజ్’ సినిమా లోనివేనా అని అనిపించడం సహజం. ఆగుస్ట్ 12న జూనియర్ అభిమానులకు పండుగ చేస్తూ 100 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా విడుదల అవుతున్న ఈసినిమాకు ప్రస్తుతం అవుతున్న బిజినెస్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE