‘బాహుబలి 2’ షూటింగ్ వీడియో లీక్?
‘బాహుబలి’ సినిమా నిర్మాణంలో దర్శకుడు రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, సినిమాలో కీలకమైన పోరాట సన్నివేశాలు ముందుగానే సోషల్ మీడియాలో లీక్ కావడం, ఆ తర్వాత మరికొన్ని దృశ్యాలు… ఇలా లీక్ ల బాట పట్టింది ‘బాహుబలి’ సినిమా. అయితే ఎలాంటి లీక్ లు అయినప్పటికీ, సినిమా ఊహకందని విజయం సాధించడంతో అందరూ లీక్ లను మరిచిపోయారు.
మరి ప్రస్తుతం సెట్స్ పై నున్న ‘బాహుబలి 2’ మాటేంటి? అంటే… ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ‘బాహుబలి’ సినిమాలో భళ్ళాలదేవుడు పాత్రలో కనిపించిన రానా విగ్రహం ఇంటర్వెల్ సీన్ కు హైలైట్ అయిన విషయం తెలిసిందే. బహుశా ఈ సినిమా బాహుబలి పాత్ర పోషించిన ప్రభాస్ విగ్రహం రూపకల్పన చేసినట్లుగా కనపడుతోంది. ఓ భారీ విగ్రహ ప్రతిష్ఠ కోసం చేస్తున్న ఏర్పాట్లుగా కనపడుతున్న ఈ వీడియోను ఆన్ షూటింగ్ స్పాట్ లోది కాకపోయినా, మేకింగ్ లో భాగం.
మరి ఎలా బయటకు వచ్చిందో గానీ, ప్రస్తుతం వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ వీడియో. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నామని నిర్మాత స్పష్టం చేయడంతో, ఈ విగ్రహం క్లైమాక్స్ లో వస్తుందన్న విషయం అర్ధమైపోయింది. ఏప్రిల్ 17, 2017న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది చిత్ర యూనిట్ ప్లాన్. మొదటి పార్ట్ ను మించిన స్థాయిలో రెండవ పార్ట్ ను జక్కన్న చెక్కుతున్నారని సినీ వర్గాల టాక్.
loading...
RECENT POSTS - SPICY
RECENT POSTS - MOVIES
RECENT POSTS - LIFE STYLE